హైదరాబాద్ అంటే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. మరి హైదరాబాద్ ముఖ్యమైన ప్రదేశాలు అంటే గుర్తుకు వచ్చేది చార్మినార్, హుస్సేన్ సాగర్. అయితే హుస్సేన్ సాగర్ నిజాం నవాబులు తవ్వించిన మంచినీటి చెరువు. కానీ ఇప్పడు దాని దుర్గందంతో  నింపారు హుస్సేన్‌సాగర్ చెంత నిలబడితే అబ్బో అనిపించే స్థాయికి తీసుకు వచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ హుస్సేన్‌సాగర్ సాగర్ పై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్న  ఆస్ట్రియా సైంటిస్టుల బృందం 


అదే హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన. దీనికోసం  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో ఆస్ట్రియా సైంటిస్టుల బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో వారు హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, నీటి శుద్ధి వంటి అంశాలపై చర్చించారు. ఈమేరకు ఇవాళ సీఎస్‌తో సమావేశమై డాన్యూబ్ నదిని శుద్ధి చేసిన పద్ధతిలోనే హుస్సేన్‌సాగర్ శుద్ధికి ఛాన్స్ ఉందని సూచించారు. రేపు సీఎం కేసీఆర్‌కు సైంటిస్టుల బృందం నివేదిక సమర్పించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: