వారం రోజుల క్రితం నెపాల్ లో భూకంపం చెలరేగింది. అది ఇప్పటి వరకు అక్కడ ప్రజలను వణికిస్తూనే ఉంది. ఎంతో మంత్రి ప్రాణాలు వదిలారు.. మరెంతో మంది క్షతగాత్రులయ్యారు.  బుద్ధుడు పుట్టిన నేపాల్ కష్టాల్లో ఉందని, వారికి అండగా నిలవాల్సిన సమయమిదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నేపాల్ ను ఆదుకునేందుకు బుద్దుడు తనకు శక్తినివ్వాలని భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు.  


నేపాల్ లో సంబవించిన భూకంపాని ఇదో మచ్చు తునక


బుద్దుడు జన్మించిన కారణం చేతనే  21వ శతాబ్దం ఆసియాదైందని మోడీ పేర్కొన్నారు. ఒక రాజ్యానికి రాజై ఉండి కూడా ప్రజల కష్టాలు చూసి తన జీవితాన్నే త్యాగం చేసి ఒక సన్యాసిగా మారిన ఆయన చరిత్ర మరువలేనిది అన్నారు. ఇప్పుడు ఆయన పుట్టిన నేలపై ప్రకృతి కోపించింది. నేపాల్ అతలాకుతలం అయ్యింది. వారికి ప్రతి ఒక భారతీయుడు అండగా నిలవాలని  ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. ఢిల్లీలోని తల్కతోరా మైదానంలో జరిగిన బుద్ధపూర్ణిమ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుద్ధుడు పుట్టిన నేపాల్ కష్టాల్లో ఉందని.. వారిని ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా ఆదుకునే సమయం ఇదని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: