మొత్తానికి ఏబీఎన్ ఛానల్ అనుకున్నది సాధించింది. కేసీఆర్ సొంత ఛానల్ కు సంబంధించిన ఓ విలేకరిపై పోలీస్ కేసు నమోదు చేయించింది. సదరు జర్నలిస్టుపై వరుస కథనాలు ప్రసారం చేసి మొత్తానికి పోలీసుల్లో కదలిక రప్పించగలిగింది. 


అనుకున్నది సాధించిన ఏబీఎన్..


జర్నలిజాన్ని అడ్డం పెట్టుకుని జనగామలో వ్యాపారిని  బెదిరిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీ న్యూస్‌ విలేకరిపై కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో నలుగురిపైనా కేసు పెట్టారు. ఐతే సదరు విలేకరి రమేశ్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. 


పరారీలో టీన్యూస్ జర్నలిస్ట్..

Image result for t news vs abn

ఇదే కేసుకు సంబంధించిన రమేశ్ తో పాటు హెచ్‌ఎంటీవీ విలేకరి శ్రీకాంత్, సాక్షి విలేకరి మాధవ్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయం ఏంటంటే.. వరంగల్ జిల్లా జనగామలో కృష్ణమూర్తి అనే వ్యాపారిని టీన్యూస్, హెచ్ఎంటీవీ స్ట్రింగర్ల వేధింపులు డబ్బు కోసం బెదిరించారట. 


జర్నలిజానికి మచ్చే..

article data

ఆయన గోదాముల్లో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వచేశారని.. తమకు లక్షల్లో డబ్బు ఇవ్వకపోతే.. ఏసీబీ, నిఘా అధికారులతో దాడులు చేయిస్తామని.. బెదిరించారట. ఆ వేధింపులు తట్టుకోలేక ఆ వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఇష్యూను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బాగా హైలెట్ చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: