ఒక్క పావుగంటసేపు ఇంటర్నెట్ పనిచేయకపోతేనే.. కాలూ చేయీ ఆడదు.. పొద్దున లేస్తూనే ఇంటర్నెట్.. రాత్రి నిద్రపోయే ముందూ ఇంటర్నెట్.. మరి అలా మానవజీవితంతో పెనవేసుకుపోయిన ఇంటర్ నెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోతే.. సకల సౌకర్యాలు అందిస్తున్న ఈ కామథేనువు.. ఒక్కసారిగా మాయమైతే..

8 ఏళ్లలో ఇంటర్ నెట్ ఢమాల్..

అదే జరగబోతోందట.. త్వరలో.. త్వరలో అంటే రేపో, ఎల్లుండో కాదు లెండి.. ఇంకో 8 ఏళ్ల తర్వాత ఇక ఇంటర్ నెట్ పనిచేయదట. ఎందుకు.. ఎందుకంటే.. రోజురోజుకూ పెరిగిపోతున్న వినియోగ ఒత్తిడేనట. అవును మరి రోజు రోజుకూ లక్షల సంఖ్యలో యూజర్స్ పెరిగిపోతున్నారు. 

సైంటిస్టులూ.. త్వరపడండి..


ఈ సంచలన విషయాన్ని లండన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇంటర్ నెట్ తన మాగ్జిమమ్ కెపాసిటీని 8 ఏళ్లలో చేరుకుంటుందట. ఇక అంతకు మించి దాని సామర్థ్యం పెంచలేమట. ఇక శాస్త్రవేత్తలంతా దాని సామర్థ్యం పెంచే పనిలో ఉండకపోతే.. 8 ఏళ్ల తర్వాత ప్రపంచానికి పిచ్చిపట్టడం ఖాయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: