తెలుగు ముఖ్యమంత్రుల మధ్య అనేక విషయాల్లో పోటాపోటీ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. నీళ్లు, ప్రాజెక్టులు, నిధులు.. ఇలాంటి విషయాల్లో రెండు రాష్ట్రాల పాలకులగా వారు తమ ప్రాంతానికి అనుకూలంగా వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పుడు ఈ అంశాలకు తోడు మరో అంశం తోడైంది.

తెలుగు నేలపై బౌద్ధ ప్రాభవం


అదే భౌద్దం.. మన దేశంలోనే పుట్టినా.. విదేశాల్లోనే ఎక్కువగా ప్రాచుర్యం ఉన్నమతం భౌద్దం.. బీహార్ లో పుట్టినా.. తెలుగు నేలపైనా భౌద్దం పరిఢవిల్లింది. ఇక్కడ అనేక ప్రాంతాలు భౌద్ద క్షేత్రాలుగా విరాజిల్లాయి. నాగార్జున సాగర్, విశాఖపట్నం, గుంటుమిల్లి వంటి అనేక చోట్ల వీటికి సంబంధించిన కట్టడాలు ఇంకా ఉన్నాయి. 


పోటాపోటీగా బౌద్ధం అభివృద్ధి..



చైనా, సింగపూర్, మలేసియా, జపాన్ వంటి ధనిక దేశాల్లో భౌద్దం ప్రభావవంతంగా ఉన్నందువల్ల భౌద్దాన్ని చూపి.. వారి సాయం పొందాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అటు కేసీఆర్ కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. నాగార్జునసాగర్ ను ప్రపంచస్థాయి బౌద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దాలంటున్నారు. బౌద్ధం ద్వారా టూరిజానికి ఊపు తేవాలంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: