తెలంగాణ రాష్ట్ర పోరాట సమయంలో తండ్రికి అండగా ఉంటూ ఉద్యమాన్ని ముందుకు సాగించిన వ్యక్తి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్).  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ రంగంపై మంచి పట్టు ఉండటంతో ఆయనకు ఐటీ శాఖ , పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా  మంత్రి వర్గంలో తీసుకున్నారు కేసీఆర్. అప్పటి నుంచి చాలా చురుకుగా పనిచేయడం మొదలు పెట్టారు కేటీఆర్.


ఓ సెమినార్ లో మాట్లాడుతున్న కేటీఆర్


ఇప్పడు రాష్ట్ర అభివృద్ది కోసం పెట్టుబడులు రాబట్టడం కోసం ఆయన అమెరికా పర్యటన చేపట్టారు. ఈ పర్యటన రెండు వారాల పాటు కొనసాగుతుంది. అమెరికాలో అడుగుపెట్టానున్న కేటీఆర్ ఈ నెల 6న వాషింగ్టన్ లోని భారత రాయబారితో భేటీ అవుతారు. ఆ తర్వాత అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పర్యటించనున్న ఆయన అక్కడి కార్పొరేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులు, యాజమాన్యాలతో వరుస భేటీలు నిర్వహిస్తారని సమాచారం. ఈ నెల 18న మైక్రోసాఫ్ట్ సీఈఓ, తెలుగు తేజం సత్య నాదెళ్లతోనూ ప్రత్యేకంగా సమావేశమవుతారని తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: