నందమూర తారక రామారావు 1982 లో తెలుగు వారి కోసం స్ధాపించిన పార్టీ తెలుగు దేశం పార్టీ (టీడీపీ). నాటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఎప్పటికప్పడు అన్ని రాజకీయ పార్టీలతో పోటీ పడుతూ వస్తుంది. ఎన్టీఆర్ మరణించిన తర్వాత ఆ పార్టీ పగ్గాలు నారా చంద్రబాబు నాయుడు చేపట్టాడు. నాటి నుంచి నేటి వరకు ఆయనే టీడీపీ అధ్యక్షులుగా ఉంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టి బీజీ షెడ్యూల్ లో ఉన్న ఆయన తన హోదాను మార్చుకొనే పనిలో పడ్డారు.  నారా లోకేష్ రాజకీయం పై మంచి పట్టు సాధించేలా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అంతే కాదు తనయుడిని ప్రమోట్ చేసుకోవడం గురించి బాబు కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టుగా తెలుస్తోంది.


తండ్రితో ముచ్చటిస్తున్న నారా లోకేష్ బాబు

 లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి బాబు జాతీయ ఆధ్యక్షుడిగా మారనున్నారట. వచ్చే ఎన్నికల నాటికి నారా లోకేష్ ను పూర్తిగా రంగంలోకి దించడానికి బాబు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే లోకేష్ పార్టీ విషయంలోనూ.. ప్రభుత్వం విషయంలోనూ జోక్యం చేసుకొంటున్నాడు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు.. లైజనింగ్ ఆఫీసర్లను నియమించుకొని.. పాలనను పర్యవేక్షిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: