పవన్ కళ్యాన్ తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా వెలుగుతున్న సమయంలో ప్రజా సేవ కోసం ఓ రాజకీయ పార్టీనే స్థాపించారు అదే జనసేన. సార్వత్రిక ఎన్నికలో తానునిలబడకుండా టీడీపీ,బిజేపీకి మద్దతు ఇచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ , రాష్ట్రంలో టీడీపీ నెగ్గింది. ఇప్పడు జనసేన పార్టీకీ  పవనే  అధ్యక్షుడు  అంతకు మించి ఈ పార్టీకి ఎలాంటి స్ట్రక్చరూ లేదు. మరి ఈయన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తాడా లేదా అన్నది ఇప్పటికీ ఆలోచించాల్సిన విషయమే.


నరేంద్రమోడి,చంద్రబాబులకు మద్దతుగా మీటింగ్ లో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్


తెలుగుదేశం వారు తమ పార్టీ సమావేశాలకు జనసేన అధినేతను ఆహ్వానించారు. మహానాడులో పాల్గొనాల్సిందిగా కోరారు! ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడం.. తెలుగుదేశం అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారం చేయడం.. ఎన్నికల తర్వాత కూడా బాబును సమర్థించడం.. రాజధాని తదితర అంశాల్లో కూడా బాబుకు అనుకూలంగానే మాట్లాడుతుండటంతో.. పవన్ తో తెలుగుదేశం పార్టీ సన్నిహితంగా మెలుగుతోంది.  ఈ నేపథ్యంలో ఆ పార్టీ మహానాడుకు పవన్ ను ఆహ్వానించింది. మరి పవన్ జనసేనను ముందుకు తీసుకెళ్తాడా బాబు బుజ్జగింపుతో టీడీపీలోకి చేరుతారా ...? అన్నది ముందు ముందు తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: