పవన్ కళ్యాన్ సినీ రంగంలో మంచి ఫోలోయింగ్ సంపాదించుకున్న నటుడు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అంటూ రాజకీయ రంగం ప్రవేశించాడు. అంతేనా ‘జనసేన’ అనే పార్టీనే స్థాపించారు. తర్వాత ఎన్నికల్లో నిలబడకుండా టీడీపీ,బీజేపీకి సపోర్టు చేసి ఎన్నికల్లో ప్రచారం చేసి మొత్తానికి వారి విజయానికి పరోక్షంగా కారణం అయ్యాడు.  ఇకపోతే తెలుగు రాష్ట్రాలు రెండు గా ఏర్పడిన తర్వాత కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని మాట ఇచ్చింది. అంటే కాంగ్రెస్ పాలనలో రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పించాలని విభజన సమయంలో అన్నారు. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ పాలన వచ్చింది. ఇప్పటి వరకు ఏపీకి ప్రత్యేక హోదా విషయం నాన్చుతూనే ఉన్నారు. దీంతో హీరో శివాజి ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని రక రకాలు గా దీక్షలు చేయడం మొదలు పెట్టాడు. అంతే కాదు ఆదివారం నుంచి  నిరాహార దీక్ష చేయడం అందరికీ తెలిసిన విషయమే. 


తూళ్లూరులో రైతులతో మాట్లాడుతున్న పవన్ కళ్యాన్


విషయానికి వస్తే.. శివాజీ ఆయన మద్దతు దారులు ఇప్పుడు కొత్త మాట మాట్లాడుతున్నారు. ఏపీ కి ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రంతో మాట్లాడటానికి పవన్ భాద్యతలు తీసుకోవాలంటున్నారు. ప్రత్యేక హోదా అంశం గురించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని శివాజీకి మద్దతు ఇచ్చే  వారంతా పవన్ కల్యాణ్   పేరును ప్రస్తావనలోకి తీసుకొస్తున్నారు. ఇక శివాజీ కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు.. ప్రత్యేక హోదా అంశం గురించి ప్రశ్నించడానికి పవన్ రావాలని అతడు ఆకాంక్షిస్తున్నాడు! ఈ విధంగా శివాజీ దీక్షలో పవన్ అంశం గురించే ఎక్కువ చర్చ జరిగింది ! 


గుంటూరు లో నిరాహార దీక్ష చేస్తున్న హీరో శివాజీ


అయితే గతంలో పవన్  రాజధాని భూముల గురించి రైతుల వద్దకు వెళ్లి హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.  బలవంతంగా లాక్కుంటే మీ తరుపున పోరాటం చేస్తానని హామీ కూడా ఇచ్చాడు.   ఇప్పటి వరకు రాజధాని ప్రాంత రైతుల విషయంలో  కూడా ఆయన స్పందించిన దాఖలాలు లేవు. ఇక పవన్ ప్రశ్నించేది ఎప్పుడు? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో శివాజీ ధర్నాలు, దీక్షలు పవన్ కు  మింగుడు పడకుండా అయ్యాయి. మరి పవన్ ఏవిధంగా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి: