ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు టీడీపీలో కడియం, ఎర్రబెల్లి,రేవంత్ రెడ్డి తదితర నాయకులు ముఖ్య అనుచరులుగా చంద్రబాబునాయుడికి ఉండేవారు. ఇప్పడు రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత కడియం శ్రీహరి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం అందరికీ తెలుసు. ప్రస్తుతం టీఆర్ఎస్ లో మంత్రిగా కొనసాగుతున్నారు.  తాజాగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. టిడిపి నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత చానాళ్ల తర్వాత చంద్రబాబును కడియం కలిశారు.


ప్రస్తుతం కేసీఆర్ మంత్రి వర్గంలో కడియం శ్రీహరి

 

అయితే ఇది తెలంగాణ రాష్ట్రంలోని  వరంగల్ జిల్లా రేయాన్స్ కంపెనీని తిరిగి ఆరంబించడానికి వీలుగా సహకరించాలని కోరారు.  ఆంద్రప్రదేశ్ లో ఉత్పత్తి అవుతున్న యూకలిఫ్టస్ కలపను ఏభై శాతం సబ్సిడీకి ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.శ్రీహరితో పాటు వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్.పిలు,ఎమ్మెల్యేలు కూడా కడియంతో పాటు చంద్రబాబును కలిశారు.తమకు ఆర్దిక సమస్యలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారని అంటున్నారు.కాగా కడియం శ్రీహరి మాత్రం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: