తెలుగు రాష్ట్రాలు రెండు గా విడిపోయిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని అది ఇప్పటి వరకు అమలుకు నోచుకోక పోవడంతో హీరో శివాజీ ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని నిరాహార దీక్ష చేస్తున్న విషయం అందరికీ తెలుసు. మూడు రోజుల దీక్ష చేసిన తర్వాత నాలుగో రోజున ఆయన నిరశనను పోలీసులు భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. కాంగ్రెస్ విభజన చేసే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని తీర్మాణం చేసినప్పటికీ బిజేపీ ప్రభుత్వం ఈ విషయంపై తాత్సారం చేస్తుందని ఆయన విమర్శించారు.


ఏపీకి ప్రత్యేక హోదా కోసం నటుడు శివాజీ నిరాహార దీక్ష


గత మూడు రోజులుగా ఆయన దీక్ష చేస్తున్నారు.  మొదటి నుంచి శివాజీ రాజకీయాలకు నేను అతీతం అంటూ వస్తున్నారు. తనకు మద్దతుగా ప్రజలు నిస్వార్థంగా వస్తున్నారని రాజకీయ నాయకులు ఇది గమనించి వారు కూడా నిస్వార్థంగా మద్దతు పలకాలని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో పోరాడాలని డిమాండు చేస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. మరోవైపు శివాజీ దీక్ష నాలుగో రోజుకు చేరడంతో   ఆయన బాగా నీరసించిపోయారు. దీక్ష విరమించాలని పోలీసులు చేసిన వినతిని ఆయన తిరస్కరించారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు దీక్ష విరమించనని చెప్పారు. ఆరోగ్యం క్షీణించినా, దీక్ష విరమించబోనని చెప్పారు. వైద్య పరీక్షల్లో శివాజీ నీరసించినట్లు నిర్ధారించారు. దీంతో పోలీసులు ఆయను బలవంతంగా వైద్య పరీక్షలకు పంపించారు.  శివాజీ దీక్ష భగ్నం చేశారు. తనను బలవంతంగా తరలించినా దీక్ష ఆసుపత్రిలో కొనసాగిస్తానని ప్రకటన ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే వరకు తాను ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తానని శివాజీ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: