బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్  మద్యం సేవించి కారు నడిపి ఒక వ్యక్తి మరణానికి,మరో నలుగురు గాయపడడానికి కారణమైన సల్మాన్ ఖాన్ నేరానికి పాల్పడ్డాడని కోర్టు నిర్ధారించింది. అయితే దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తన సహచరుడు సల్మాన్కు ఇలాంటి పరిస్థితి రావడం బాధగా ఉందని. ఎవరూ కావాలని ఉద్దేశ పూర్వకంగా ఒకరి ప్రాణాలు తీయాలనుకోరు. వాస్తవానికి సల్మాన్ ఖాన్ నిస్వార్థపరుడు, సేవా తత్పరం కలిగిన వ్యక్తి ‘బీయింగ్ హ్యూమన్ చారిటీ’ స్థాపించి ఎంతో మందికి సేవ చేశాడు.


పోలీస్ కస్టడిలో సల్మాన్ ఖాన్


శిక్ష వేసే సమయంలో న్యాయమూర్తి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటే బాగుండేది. అయితే, ఆయన హైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నందున కొంత మేలు జరుగుతుందనే ఆశ ఉందని అన్నారు. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ దోషే అని కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఈ విధంగా స్పందించారు.


అదే విధంగా సల్మాన్ ఖాన్ కి మంచి మిత్రుడైన మెగాస్టార్ తనయుడు రాంచరణ్ కూడా సల్మాన్ ఖాన్ శిక్ష పడటంపై విచారం వ్యక్తం చేశాడు. స్వతహాగా సల్మాన్ చాలా మంచివాడని ఎప్పడైన బాంబే వెళితే తనను చాలాబాగా రిసీవ్ చేసుకునేవాడని అదే విధంగా తను ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే తమతో గడిపేవాడని బాదపడ్డాడు. 


సల్మాన్ ఖాన్ తో రాంచరణ్


మరింత సమాచారం తెలుసుకోండి: