తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా అందరం కలిసే ఉందాం అంటూ చాలా మంది పెద్ద‌లు చెప్పుకు వ‌చ్చారు. అందులో ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ రెండుగా విడిపోదు అని స్ప ష్టంగా తేల్చి చెప్పారు పెద్దలు. అక్కడితో సమస్య కొంతకాలం సద్దుమణిగింది. మళ్లీ ఇప్పుడు ఆంధ్రా ప్రాంతానికి రాజధానిగా అమరావతిని అధికారికంగా ప్రకటించడంతో సినిమా పరిశ్రమ దృష్టి ఆ దిశగా చూస్తోందని సంకేతాలు వస్తున్నాయి. 


తెలుగు సినిమాను 1921లోనే నిర్మించిన ఘనత


తెలుగు సినిమాను 1921లోనే నిర్మించిన ఘనత. అటు తరువాత 1931-1940 దశకంలో మొత్తం 76 తెలుగు సినిమాలు,1940-1950 దశాబ్దం లో 91 సినిమాల నిర్మాణం జరిగాయి. తెలుగు సినిమా బహుముఖం గా పుంజుకున్నది. ఎందరో కళాకారుల, దర్శకుల ప్రతిభాపాటవాలను అందిపుచ్చుకున్నారు. ఏటా వందకు పైగా చిత్రాల నిర్మాణం జరిగేవి. ఈ కాలంలో మూడు వందలకుపైగా తెలుగు చిత్రాలు నిర్మాణం అవుతున్నాయి. 1954లో కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులు ప్రవేశపెట్టి ఏటా ఉత్తమ చిత్రాలకు, దర్శకులకు ఇతర సాంకేతిక నిపుణులకు అవార్డులు అందజేస్తోంది. ఈ లాంటి త‌రుణంలో తెలుగు సినిమా ప‌రిశ్రమ ఆంద్ర కు వెళ్లితే ప‌రిశ్ర‌మ అనుకునంత గా ఫ‌లితాల‌ను సాదిస్తుందా కొత్తగా వ‌చ్చిన రాష్ట్రం అర‌కొర వ‌స‌తుల‌తో ఉన్న ఏపీలో ప‌రిశ్ర‌మ నిల‌దొక్కుకుంటుందా అన్న‌ది ప్ర‌శ్నార్ధ‌కమే. 


భారీ ఫిలింసిటీని కట్టిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్‌


మ‌రోవైపు.. త్వరలోనే అందరికీ అందుబాటులో ఉండేలా భారీ ఫిలింసిటీని కట్టిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్‌ పేర్కొన్నారు .హైదరాబాద్‌లో షూటింగ్‌లు చేసుకునే వారికి సబ్సిడీ ఇచ్చేలా ప్లాన్‌ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి కోసం భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే ఫిలింసిటీ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. అందుకు సినీ పెద్దలంతా సంతోషించారు. అయితే కొందరు బయటపడలేదుగానీ ఆ ఫిలింసిటీలో ఆంధ్రా నిర్మాతలకు స్థానం ఉంటుందా లేదా? ఒకవేళ కాకుంటే పరిస్థితి ఏమిటి? అందుకు భరోసా ఇచ్చేవారు లేరు. కొత్త రాజధాని పనుల్లో తలమునకలై ఉన్న చంద్రబాబు కూడా సినిమా పరిశ్రమపై పెద్దగా ఏనాడూ దృష్టి పెట్టలేదు. 


పై రెండు రాష్ట్రాల‌ నేతలూ దృష్టిపెట్టబోతున్నారు


అయితే.. ప్రస్తుతం కేంద్ర సాయం అంతంతమాత్రంగా ఉన్న తరుణంలో ఆంధ్ర రాష్ట్రానికి తక్షణమే ఆదాయం తెచ్చిపెట్టే వనరులపై దృష్టిపెట్టారు చంద్రబాబు. ఇప్పటికే పర్యాటక రంగాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసేలా చకచకా పనులు జరుగుతున్నాయి. ఇక వినోద రంగాన్ని కూడా ఆంధ్ర ప్రాంతంలో విస్తరించేందుకు పావులు కదుపుతున్నారు. బాలీవుడ్‌ తర్వాత ఆ స్థాయిలో దేశంలో సినిమాలను నిర్మించే టాలీవుడ్‌ ఆదాయ వనరులపై రెండు రాష్ట్రాల‌ నేతలూ దృష్టిపెట్టబోతున్నారు. 


చంద్రబాబు ఆ సినీ పెద్దలకు అమరావతి పరిసర ప్రాంతాలలో


పర్యాటక రంగం ఊపందుకోవాలంటే అందుకు తోడు వినోద రంగం జతగా ఉండాలి. ఎక్కడైతే స్టూడియోలు, షూటింగులు జరుగుతాయో అక్కడికి దేశవిదేశ యాత్రికులు తరలివస్తారు. ప్రభుత్వానికి కూడా వినోద రంగం పేరిట ఇబ్బడిముబ్బడిగా ఆదాయ వనరులు లభ్యమవుతాయి. అంత పెద్ద ఆదాయ వనరులను ఏ రాష్ట్రం మాత్రం ఎందుకు వదులుకుంటుంది. అసలే సినిమా రంగంలో ఆదినుంచి ఆంధ్రా ఆధిపత్యమే ఎక్కువ. అంతా వాళ్లు పెట్టిన పెట్టుబడులతోనే నడిచింది ఇప్పటిదాకా... అందుకే చంద్రబాబు ఆ సినీ పెద్దలకు అమరావతి పరిసర ప్రాంతాలలో భారీగా భూములు ఇచ్చి స్టూడియోలకు పర్మిషన్‌ ఇద్దామనుకుంటున్నట్లు సమాచారం.


ఇప్పటికే కొందరు బడా సినీ పెద్దలు అక్కడ సర్వే కూడా చేయడం మొదలుపెట్టేశారు. రాజధాని పరిసర ప్రాంతంలో అందరికీ అందుబాటులో స్టూడియోల నిర్మాణం జరిగితే ఇక రాష్ట్ర వినోద, టూరిజం రంగాలకు ఎలాంటి ఢోకా ఉండదు. ఈ రెండూ ఒకదానికి ఒకటి అనుసంధానంగా ఉంటాయి. టాలీవుడ్‌ పెద్దలు కొందరి నడుమ కొత్త వ్యూహానికి, సరికొత్త చర్చలకు తెరలేచింది. చంద్రబాబు నాయుడు చకచకా ఆంధ్ర వ్వవహారాలను చక్కబెడుతుండడంతో, టాలీవుడ్‌ జనాల దౄష్టి అటు మళ్లింది. దేశ,విదేశీ పరిశ్రమలు అన్నీ ఆంధ్రకు తెస్తున్న చంద్రబాబు, ఇప్పుడు సినిమా పరిశ్రమను కూడా రమ్మని కబురు పంపినట్లు సమాచారం.


సినిమా రంగానికి చెందిన ఓ కీలక నిర్మాత 


సినిమా రంగానికి చెందిన ఓ కీలక నిర్మాత కమ్‌ స్టూడియో ఓనర్‌ ద్వారా ఈ సమాచారం కొందరికి అందింది. అమరావతికే సినిమా పరిశ్రమను కూడా మళ్లించాలని బాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతికి సినిమా పరిశ్రమను తీసుకెళ్లడం వెనుక చాలా వెసులు బాటు వుంటుంది. ఒకటి స్థలం. సినిమా పరిశ్రమకు కనీసం కొన్ని వేల ఎకరాలు కేటాయించాల్సి వుంటుంది. విశాఖలో అంత స్థలం కష్టం. అదే విధంగా సినిమా పరిశ్రమ అమరావతికి వస్తే, ఫ్లోటింగ్‌ పాపులేషన్‌, ఉపాథి బాగా పెరుగుతుంది. అదే విధంగా స్టూడియోలు వుంటే పర్యాటకం కూడా బాగుంటుంది. ఇలా అన్ని విధాలా అనువైనది కనుక, హైదరాబాద్‌ కు సమాంతరంగా అమరావతిలో కూడా సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని బాబు సంకల్పించనట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: