చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీకి పెట్టుబడులు సాధించేందుకే అమెరికా వెళ్లానన్న లోకేశ్ వాదనపై విమర్శలు పెరుగుతున్నాయి. కనీసం పార్టీలోనూ చెప్పుకోదగిన పదవి లేని లోకేశ్.. ఏపీ ప్రభుత్వం తరపున విదేశీ పర్యటన ఎలా చేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

సొంత టూరుకు ప్రభుత్వ ఖర్చులా..?

ఐతే.. ఇది లోకేశ్ వ్యక్తిగత పర్యటన అని సరిపెట్టుకోవచ్చు.. కానీ అలాంటప్పుడు ఆయనకు సహాయకులుగా పార్టీ నాయకులో.. సానుభూతిపరులో ఉండటం సహజం. కానీ ప్రభుత్వ కార్యక్రమం కాకపోయినా.. లోకేశ్ వెంట ప్రభుత్వ అధికారులను ప్రభుత్వ ఖర్చులతో పంపడం వివాదానికి దారి తీస్తోంది.  

వ్యక్తిగతమా.. అధికారికమా..?


నారా లోకేశ్ వెంట.. ముఖ్యమంత్రి ఓఎస్డీ సీతేపల్లి అభీష్ట, పరిశ్రమల శాఖ డెరైక్టర్ కార్తికేయ మిశ్రా కూడా అమెరికా వెళ్లారు. వీరిద్దరినీ ప్రభుత్వ ఖర్చులతో ప్రత్యేకంగా అమెరికా పంపించారు. అందు కోసం రెండు జీవోలు కూడా విడుదల చేశారు. కానీ ఎక్కడా అధికారికంగా చెప్పడం లేదు. ఐతే.. ప్రభుత్వ ఖర్చుతో అమెరికా వెళ్లిన ఈ ఇద్దరు అధికారులు లోకేశ్ వెంటే ఉంటున్నారనడానికి నిదర్శనంగా కొన్ని ఫోటోలు మీడియాకు చిక్కాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: