తెలంగాణ సర్కారు నిర్ణయాలకు` ప్రకటనలకు` ఆచరణకు బోలెడంత వ్యత్యాసం ఉన్నట్లుగా ఎవరికైనా అనిపిస్తే నివ్వెరపోవాల్సిన అవసరం లేదు. ప్రకటనలు అనేవి.. ప్రజలను మభ్యపెట్టడానికి తీసుకుననేవి! నిర్ణయాలు అనేవి రికార్డుల్లో, మినిట్స్‌లో రాసుకోవడానికి తీసుకునేవి! ఆచరణ అనేది మాత్రం.. తమ ఇష్టాఇష్టాల ప్రకారం సాగేది! అని తెలుసుకోవాలి. ఇప్పుడు బుగ్గకారు హోదాను అయాచితంగా దక్కించుకున్న ఓ ప్రముఖుడికి అదే అనుభవంలోకి వస్తోంది. 


తెలంగాణ నూతన రాష్ట్రంలో కేసీఆర్‌  ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కీలక నామినేటెడ్‌ పోస్టుల భర్తీని చాలాకాలం పాటూ నాన్చింది. ఎట్టకేలకు పలు విజ్ఞప్తులు, ఒత్తిళ్లు పర్యసానంగా కొన్ని భర్తీ చేశారు. అందులో నిరుద్యోగుల కలలు తీర్చే పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి. సదరు పోస్టులు భర్తీ అయిన వెంటనే.. ఇక తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల వెల్లువ వచ్చేస్తుందని అంతా కలలు కన్నారు. అయితే నెలలు గడచిపోతున్నాయి గానీ.. అలాంటి దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. 


ఆరా తీస్తే తెలుస్తున్నదేంటంటే.. ప్రభుత్వంలోని ఓ ముఖ్యనేత.. సదరు నామినేటెడ్‌ పోస్టులో కుదురుకున్న పెద్దాయనను పిలిచి.. దూకుడుగా పనిచేసేయాల్సిన అవసరమేమీ లేదని హితవు చెప్పారుట. ‘బుగ్గకారు ఇచ్చాం కదా.. తిరుగుతూ ఉండు. నువ్వు ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు’ అని ఓ టైపులో హెచ్చరించారుట. ‘యింక నేనేమి చేసేది సారూ..’ అంటూ చేతులు కట్టేసినట్లుగా ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: