చంద్రబాబుకు హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు. టెక్నాలజీ వాడకంలో అందరికంటే ముందుంటారని చెప్పుకుంటుంటారు. మరి అలాంటి ముఖ్యమంత్రిని ఢీకొనాలంటే.. ఆ రూట్ నే ఫాలో కావాలి కదా.. అందుకే ప్రతిపక్షనేత జగన్ కూడా బాబును ఇరుకునపెట్టేందుకు టెక్నాలజీని వాడుకుంటున్నారు.

బాబు బాటలో జగన్.. 


ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నో హామీలిచ్చారు. వాటిలో చాలావరకూ ఇంకా అమలు చేయలేదు. చిన్నా చితకా హామీల సంగతి పక్కకు పెడితే.. రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీ వంటి ప్రధాన హామీలే ఇంకా పూర్తిగా అమలు కాలేదు. అందుకే ఆ అంశాన్ని జగన్ హైలెట్ చేస్తున్నారు. 

అనంతపురంజిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్నజగన్.. ఊరికే అవి చేయలేదు.. ఇవి చేయలేదు అని చెప్పకుండా.. ఓ స్మార్ట్ ఫోన్ ను ఆయుధంగా వాడుకుంటున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందునాటి హామీల క్లిప్పింగులు స్మార్ట్ ఫోన్లో ప్లే చేసి చూపిస్తూ.. ఆకట్టుకుంటున్నారు. ఒక్కో హామీని వినిపిస్తూ.. ఈ హామీ నెరవేరిందా అని ప్రజలను అడిగి వారి నుంచి సమాధానం రాబడుతున్నారు. 

స్మార్ట్ ఫోన్ తో.. జగన్  స్మార్ట్ వర్క్.. 


రైతు రుణాలు భేషరతుగా మాఫీ చేస్తా.. డ్వాక్రా రుణాలు అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తా.. చేస్తా.. అంటూ బాబు చెప్పిన డైలాగులను ఒకటికి రెండు సార్లు పలికిస్తూ.. హామీల అమలులోని డొల్లతనాన్ని బయటపెడుతున్నారు. ఇదేదో బాగానే ఉంది కదా.. 



మరింత సమాచారం తెలుసుకోండి: