తెలుగు రాష్ట్రాలు రెండు గా విడిపోయిన తర్వాత కాంగ్రెస్ ఇరు రాష్ట్రాల్లో పూర్తి ప్రాభల్యం కోల్పోయింది. తిరిగి ఇరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పునర్ వైభవాన్ని తీసుకు రావడానికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాం రైతు భరోసా యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ ను సందర్శించి రైతులకు భరోసా ఇచ్చాడు. వారికి అండగా ఉంటానని చెప్పాడు. అంతే కాదు తెలంగాణ రాష్ట్ర అభివృద్ది చేస్తానంటున్న కేసీఆర్ రైతు ఆత్మహత్యలకు ఏం సమాధానం చెబుతారు అన్నారు, అంతే కాదు తెలంగాణలో కేసీఆర్ ఒక రకంగా మోడీ పాలన కొనసాగిస్తున్నాడు అన్నారు. ఇక్కడ ఆయన ఓ చిన్న మోడీ అని విమర్శించారు.


రైతు భరోసా యాత్రలో రాహుల్ గాంధీ


దీనిపై స్పందించిన నిజామాబాద్ ఎంపీ కవిత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధిపై విరుచుకు పడ్డారు. రాకుమారుడుకి విహార యాత్రలు చేయడం అలవాటే అదే విధంగా తెలంగాణకు కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు ఆయన రావడం వల్ల ఇక్కడ వరిగిందేమీ లేదు అంటూ విమర్శించారు. అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయమై ఆమె విలేకరులతో మాట్లాడుతూ..  నిజాం షుగర్ ఫ్యాక్టరీపై  ప్రభుత్వపరం చేసేందుకు సర్కారు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులను కూడా పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో నిజామాబాద్ జిల్లాలో పసుపు పార్క్ ఏర్పాటు చేస్తామని ఎంపీ కవిత పేర్కొన్నారు.


ఆత్మహ్యత రైతు కుటుంబాన్ని పరామర్శిస్తున్న రాహుల్ గాంధీ



మరింత సమాచారం తెలుసుకోండి: