తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగించి తమ డిమాండ్లను నెరవేర్చుకున్నారు. అంతేనా తెలంగాణ సీఎం వారిడిమాండ్లకు పూర్తి వ్యతిరేకంగా ఢబుల్ ధమాకా  44 % పర్సెంటీజీ రక రకాల అలవెన్సులు పొంది సీఎం ద గ్రేట్ అనిపించుకున్నాడు. ఇంతవరకు ఓకే ఇప్పడు తెలంగాణలో ఓ ట్రెండ్ మొదలైంది, తమ కోర్కెలు నెరవేర్చుకోవాలంటే సమ్మె సైరన్ మోగించాల్సిందే అని నిర్చయించుకున్నారో ఏమో ఇప్పడు అర్చక సంఘం డిమాండ్ల చిట్టా పట్టుకొని ప్రభుత్వం ముందు నిలబడింది.


యాదగిరి గుట్ట


తాజాగా తెలంగాణ దేవాదాయ శాఖ అర్చకులు కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.వచ్చే జూన్ నెల నాలుగు లోగా తమ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రాతఃకాల పూజలు చేసి ఆలయాలను బంద్ చేస్తామని తెలంగాణ రాష్ట్ర దేవాలయ అర్చక, ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు వారు దేవాదాయ శాఖ కమిషనర్ కు నోటీసు ఇచ్చారు. ఆలయ అర్చకులకు ట్రేజరీ ద్వారా వేతనాలను చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర దేవాలయాల అర్చక ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు గంగుభాను మూర్తి ప్రభుత్వాన్ని కోరారు.



దేవాలయాల ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. దేవాయాలపై వచ్చే ఆదాయానికి, వేతనాలకు ముడిపెట్టడం సరికాదని హితవు పలికారు. అర్చకులకు బడ్జెట్ లో వంద కోట్ల రూపాయలను కేటాయించాలని కోరారు. వేతనాలు పెంచి... అర్చకులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అర్చకులకు వేతనాలు ఇవ్వాలని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: