చంద్రబాబు కు నమ్మిన బంటుగా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ బాధ్యతలు చేపట్టి అప్పట్లో ఆయన ప్రశంసలు బాగానే పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దయాకర్ రావు టీడీపీ ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నాడు. తాజాగా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ రాజేశ్వరరెడ్డి  ఎర్రబెల్లి దయాకరరావు పది మంది టిడిపి ఎమ్మెల్యేలతో టిఆర్ఎస్ లోకి రావడానికి కెసిఆర్ వద్ద గతంలో బేరం పెట్టాడని రాజేశ్వరరెడ్డి ఆరోపించారు.

ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఎర్రబెల్లి దయాకర్రావు


దీనిపై స్పందించిన శాసనమండలి మాజీ సభ్యుడు అరిగెల నరసారెడ్డి  తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకరరావును కొనే దమ్ము ఎవరికి లేదని ఎవరి మెప్పుకోసమే ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  దయాకరరావు ముప్పై ఏళ్లుగా టిడిపిలో చిత్తశుద్దితో పనిచేస్తున్న నాయకుడు అని అన్నారు. ఆయనపై అబాండాలు వేసి కేసీఆర్ మెప్పు పొందాలని చూస్తున్న రాజేశ్వర రెడ్డి ముందు ఆయన చరిత్ర సరిగా ఉందా అని ప్రశ్నించాడు, రాజేశ్వరరెడ్డి అక్రమంగా భూమి కజ్జా చేసి ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించుకొని ప్రభుత్వాన్ని మోసం చేశాడని నరసారెడ్డి ఆరోపించారు.


చంద్రబాబు నాయుడితో ఎర్రబెల్లి (ఫైల్)



తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో మంది స్వార్ధంతో టీఆర్ఎస్ లోకి వెళ్లారని కానీ ఎర్రబెల్లి మాత్రం టీడీపీ అభివృద్దికి పాటు పడుతున్నాడని ఎర్రబెల్లి పార్టీ మారే దౌర్బాగ్య స్థితిలో లేరని, ఆయన ను విమర్శించే నైతిక హక్కు టిఆర్ఎస్ కు లేదని నర్సారెడ్డి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: