హైదరాబాద్ లో గన్ కల్చర్ పెరిగింది, పట్టపగలు ఏటీఎం వద్ద డబ్బులు డ్రాచేయడానికి వచ్చిన ఓ మహిళను బెదిరించి దుండగులు నగలు, నగదు దోచుకున్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఇటీవలి కాలంలో నగరం అరాచక సంఘటనలకు అడ్డాగా మారుతోంది. బుధవారం ఉదయం 7:30 గంటల సమయంలో ఎస్‌బీఐ ఏటీఎంలో శ్రీలలిత అనే యువతిని తుపాకీతో బెదిరించిన దుండగులు ఆమె వద్ద ఉన్న నగదు, నగలను అపహరించారు.


చోరీకి గురైన ఏటీఎం సెంటర్, ఎటీఎం పక్కన బుల్లెట్ గుర్తు


బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.  కాగా యూసుఫ్‌గూడ ఏటీఎమ్‌లో యువతిని తుపాకీతో బెదిరించి నగదును అపహరించిన దుండగుడు తర్వాత వేరొక ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బు డ్రా చేశాడు, ఆ సమయంలో సీసీ టీవిలో ఈ నింధితుడి కదలికలు కనబడ్డాయి.   సీసీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు దుండగుడి ఫోటోను విడుదల చేశారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: