తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఓయూ విద్యార్థులను దిక్కరించి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు ఏమీ బాగాలేదు అని కేసీఆర్ ని విద్యార్ధులతో పెట్టుకోవద్దని బిజెపి సీనియర్ నేత డాక్టర్ నాగం జనార్దనరెడ్డి సలహా ఇచ్చారు. ఉస్మానియా విద్యార్థుల పోరాటాలు.. త్యాగాల ఫలితంగానే తెలంగాణ సీఎం కుర్చీ కేసీఆర్‑కి దక్కిందని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు. ఉస్మానియా విద్యార్దుల పోరాటాలు,త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందని, కెసిఆర్ కు సి.ఎమ్.కుర్చీ వచ్చిందని ఆయన అన్నారు.


కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న విద్యార్థులు


మంచికి మంచీ చెడుకి చెడు అన్నతీరుగా వ్యవహరిస్తారు విద్యార్థులు అయినా అవసరం తీరిపోయిన  తర్వాత మొఖం తిప్పుకోవడం కేసీఆర్ కి మొదటి నుంచి అలవాటు అంటూ నాగం విమర్శించాడు. యూనివర్శిటీ విద్యార్థులను కేసీఆర్‑ బచ్చాగాళ్లనడం సబబు కాదని ఆయన అన్నారు.తాను కూడా ఉస్మానియాలో చదువుకున్నానని , అది పోరాటాల గడ్డ అని ఆయన అన్నారు. 1969 నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన పోరాటంలో ఉస్మానియా యూనివర్శిటీ తెలంగాణ పురిటి గడ్డ అయిందని నాగం పేర్కొన్నారు. ఓయూ యూనివర్సిటీలో పదకొండు ఎకరాలు తీసుకొని పేద ప్రజలకు ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్ స్వచ్ఛ భారత్ సందర్భంగా పేద ప్రజలకు హామీ ఇచ్చారు.


యూనివర్సిటీ భూములను కాపాడండి అంటూ నినాదాలు



మరింత సమాచారం తెలుసుకోండి: