ఆయన ఓ బీజేపీ నేత సాధాసీదా నేత కాదు భారత ప్రదాని మోడీ కి అతి సన్నిహితుడు. ఈయన చేసిన ఘనకార్యం తో పెళ్లి పందిట్లో హంగామా జరిగింది. సుబ్రమణ్మస్వామి తమిళనాడులోని తిరునల్వెలిలో బుధవారం ఆయన ఓ పెళ్లికి హాజరయ్యారు. తాళిబొట్టును తన చేతుల మీదుగా వరుడికి అందించాలని పెద్దలు కోరగా అందుకు ఆయన అంగీకరించారు. మరి మనోడికి తాళి బొట్టు చూడగానే తన యవ్వనం గుర్తుకు వచ్చిందో ఏమో కాని ఏకంగా తాళిబొట్టు తీసుకొని పెళ్లి కూతురుకి తాళి కట్టబోయాడు.

తాళి బొట్టు కట్టబోయిన బీజేపీ నేత సుబ్రమణ్మస్వామి 


మొదట అక్కడ ఏంజరుగుతుందో ఎవరికీ అర్ధం కాలేదు తర్వాత తేరుకొని వెంటనే ఓ పెద్దావిడ అరే అదేంటీ అంటే స్వామిని వారించగా వెంటనే తేరుకున్న మనోడు తాను పరధ్యానంతో చేసిన చర్యకు స్వామి కాస్త సిగ్గుపడి నవ్వుకున్నారు. ఆయన చర్యలతో పెళ్లికి వచ్చిన అతిథులు, వధూవరుల కుటుంబసభ్యులు ఈ సంఘటనతో షాక్ తిన్నారు. అమ్మా... పెళ్లి పెద్దగా వచ్చి దీవించయ్య బాబూ అంటే ఏకంగా పెళ్లికొడుకే ఎసరు పెట్టాలని చూస్తాడా అని అందరూ గుస  గుస లాడుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: