ఏపీ అంటే కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అనేక విషయాల్లో కేంద్రం నిరాశపరుస్తోంది. ఇప్పుడు కరువు సాయం విషయంలోనూ అదే స్పందన కనిపిస్తోంది. కొన్నాళ్లుగా ఏపీలో వర్షాలు తగినంతపడక కరవు పరిస్థితులు నెలకొన్నాయి. 

కేంద్రమా.. ఇదేనా.. సాయం?


వర్షాభావం కారణంగా.. దాదాపు ఏపీలోని 230 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయట. అవన్నీ పేర్కొంటూ.. దాదాపు 1900కోట్ల రూపాయల సాయం చేయాలని ఏపీ అధికారులు కేంద్రానికి నివేదికలు పంపించారు. అడిగినంత సాయం చేస్తారన్న ఆశలు ఎవరికీ లేవు గానీ.. కానీ అందులో సగమైనా ఇస్తారని అధికారులు అంచనా వేశారు. 

నివేదికల్లో లోపాలే కొంప ముంచాయా.. ?


ఐతే.. 1900 కోట్ల రూపాయలు అడిగితే.. అందులో కనీసం పది శాతం అంటే.. 190 కోట్లు కూడా ఇవ్వడం లేదట. దాదాపు 110 కోట్లు ఇస్తే ఇవ్వొచ్చని కేంద్ర హోంశాఖ ఉత్తరం రాసిందట. అంతేకాదు.. ఏపీ పంపిన నివేదికలు సరిగ్గా లేవని చెప్పుకొచ్చిందట. 


మరింత సమాచారం తెలుసుకోండి: