పవన్ కళ్యాన్ మెగాస్టార్ తమ్ముడిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేక స్టయిల్ ఏర్పాటు చేసుకొని అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. మొదట్లో కొన్ని సినిమాలు ప్లాపులు, హిట్లు అయినా పవన్ ఇమేజ్ అలా కాపాడుకుంటూ వచ్చాడు. తర్వాత చిరంజీవి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన తర్వాత పవన్ కల్యాన్ సినిమాలు మంచి హిట్లు సాధించడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేశాడు.

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ హీరో శివాజీ నిరాహార దీక్ష


అంతే కాదు పవన్ సామాజిక సేవా భావం కలిగిన వ్యక్తి కావడంతో ‘జనసేన’ అనే పార్టీ స్థాపించి ప్రజల పక్షాన పోరాడుతా అని అందరి మన్ననలు పొందాడు. తాజాగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు పవన్ ఇరుకున పడేసే విధంగా ఉన్నాయి. ఆ మధ్య హీరో శివాజీ ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ నిరాహార దీక్ష చేశాడు. ఇప్పడు కాంగ్రెస్ నాయకులు ఏపీ ప్రత్యేక హోదా పై కొట్లాడుతున్నారు. మరో వైపు రాజధాని భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం రైతులను టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ఏపీకి అండగా నిలవాల్సిన బాధ్యత పవన్ పై ఉంది అంటూ అందరూ అంటున్నారు.

ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ నేతల నిరసన


మరి ఏపీ ప్రత్యేక హోదాపై పోరాడుతాడా..? రాజధాని భూముల విషయంలో రైతుల పక్షాన నిలబడతాడా..? మరో ట్విస్ట్ ఏంటంటే ఈ నెలలోనే గబ్బర్ సింగ్ 2 సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇటు సినిమా పరంగా చూస్తే అభిమానులు తమ హీరో రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరి పవన్ ఎటు వైపు అడుగులు వేస్తారో అని అందరూ ఎదురు చూస్తున్నారు.


గబ్బర్ సింగ్ 2 సినిమా ఫ్యాన్స్ మేడ్ పోస్టర్



మరింత సమాచారం తెలుసుకోండి: