తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్న సమయాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. పగటి పూటే కాదు, రాత్రి వేళల్లోనూ ఉక్కపోత తీవ్ర మవుతోంది. పసిపిల్లలు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక్కసారిగా పెరుగుతున్న ఎండలు, గాలిలో గణనీయంగా తగ్గిపోతున్న తేమశాతంపై వాతావరణ శాస్త్రవేత్తలు సైతం స్పష్టమైన కారణాలు చెప్పలేకపోతున్నారు.  


భగ భగ మండుతున్న సూర్యుడు


రెంటచింతలలో బుధవారం రికార్డు స్థాయిలో 44.4 డిగ్రీలకు చేరింది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నాయి. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో ఈ సారి వేసవిలో ఎండలు కాస్త ఎక్కువగా ఉంటాయని అందరూ బావించారు.  ఉదయం 8 గంటలకు ముందే భానుడు భగభగమని మండుతున్నాడు. 8 గంటలకు ఎండ మండుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్న వడగాడ్పులతో పిల్లలు, వృద్ధులు అల్లాడుతున్నారు. కాలు బయటపెట్టడానికి జనం జంకుతున్నారు. కాలు బయటపెట్టడానికి జనం జంకుతున్నారు.   ప్రతి రోజు 42 నుంచి 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఎండ వేడిమితో ప్రజలు ఉక్కిరి బిక్కిరి


రోహి ణి కార్తె రాకుండానే ఎండలు మండుతున్నాయని ఇక కార్తె రోజుల్లో పరిస్థితి ఏమిటోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.   వాతావరణ శాఖ అంచనాలకు మించి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పాత రికార్డులు మరుగున పడిపోతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.. సాధారణంగా ఈ సమయంలో 41 డిగ్రీలు మాత్రమే నమోదు కావాల్సి ఉంది. ఇక ఆదిలాబాద్‌, రామగుండంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగానే నమోదవుతున్నాయి


చల్లని పానియాలతో సేద తీరుతున్న ప్రజలు


తెలంగాణలో 13 మంది మృతి...

పగటి వేళల్లో రోడ్డుపైకి రావాలంటేనే జనం జంకుతున్నారు. అడుగు బయటపెట్టేముందు...ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. తెలంగాణలో వడదెబ్బకు బుధవారం ఒక్కరోజే 13 మంది చనిపోయారు. కరీంనగర్‌ జిల్లాలో 5 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో ముగ్గురు, వరంగల్‌ జిల్లాలో ముగ్గురు, ఆదిలాబాద్‌లో ఇద్దరు మరణించారు.


సమ్మర్ సీజన్ లో ఎక్కువ మంచినీరు తాగాలని సూచిస్తున్న డాక్టర్లు


జాగ్రత్తగా ఉండాలంటున్న అధికారులు..

మరో మూడు రోజుల పాటు వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని స్పష్టం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: