జూపూడి ప్రభాకర్ అంటే వైఎస్సార్ సీపీ లో కీలక పాత్ర వహించిన వ్యక్తి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత వైఎస్ జగన్ వెన్నంటి ఉంటూ అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ పై ఒంటి కాలిపై లేచే వాడు. తెలుగు రాష్ట్రాలు రెండు గా విడిపోయిన తర్వాత మనోడు కూడా మనసు మార్చుకున్నాడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిపోయాడు. అయితే జూపూడిని దురదృష్టం వెన్నంటింది, ఏపీ శాసన సభలో టీడీపీ తరఫున ఎమ్మెల్సీ స్థానం దక్కినట్టే దక్కి అతనికి చేజారిపోయింది.


మాజీ స్పీకర్ ప్రతిభా భారతి


జూపూడికి ప్రస్తుతం కూకట్‌పల్లిలో ఓటు హక్కు ఉంది. తెలంగాణలో ఓటు హక్కు ఉన్న జూపూడికి ఏపీలో ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం లేదు. దీంతో జూపూడి స్థానంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రతిభా భారతికి టీడీపీ అధిష్టానం అవకాశం కల్పించనుంది. వాస్తవానికి టీడీపీ అధిష్టానం జూపూడికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ఎంపిక చేశారు. కానీ చివరి క్షణాల్లో జూపూడి ఆశలపై నిబంధనలు నీళ్లు చల్లాయి.


ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేకపోవడంతో జూపూడిని మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. గతంలో స్పీకర్‌గా పనిచేసిన ప్రతిభా భారతికి ఇన్నాళ్లకు అదృష్టం వరించింది, జూపూడి స్థానంలో ఎమ్మెల్సీగా ప్రతిభాభారతిని టీడీపీ పెద్దలు ఎంపిక చేశారు.  ఈ విషయాన్ని స్వయంగా మంత్రి అచ్చెం నాయుడు ప్రతిభా భారతికి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: