యూసుఫ్‌గూడ ఎస్‌బీఐ ఏటీఎం కేసులో పురోగతి లభించింది. ఏటీఎంలో బాధితురాలిని దుండగుడు బెదిరిస్తున్న సీసీటీవీ ఫుటేజ్‌ విజువల్స్‌ పోలీసుల విడుదల చేశారు.  బుధవారం యూసఫ్ గూడ రహదారిలో ఉన్న  ఎస్‌బీఐ ఏటీఎంలో శ్రీలలిత అనే యువతిని తుపాకీతో బెదిరించిన దుండగులు ఆమె వద్ద ఉన్న నగలను,ఏటీఎం కార్డు, సెల్ ఫోన్ దోచుకొని పరారయ్యాడు. తూర్పూ గోదావరి జిల్లా తాటిపాకకు చెందిన శ్రీలలిత (24) బుధవారం ఉదయం  ఏడున్నర ప్రాంతంలో యూసుఫ్ గూడ దారిలోని ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లింది.


చోరీ జరిగిన ఏటీఎం సెంటర్ వద్ద పోలీసుల ఎంక్వెయిరీ


నగదు తీసుకునేందుకు ప్రయత్నించగా కేవలం రశీదు మాత్రమే వచ్చింది. ఇంతలో ముఖానికి కర్చీఫ్ ధరించిన అగంతకుడు లోపలకు వచ్చాడు, రివాల్వర్ చూపెట్టి ఒంటిపై ఉన్న నగలు తీసి ఇవ్వాలని ఆమెను బెదిరించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో రివాల్వర్‌తో ఏటీఎంలోనే కాల్పులకు తెగబడ్డాడు. భయపడిన యువతి నుండి ఏటీఎం కార్డ్ లాక్కున్నాడు. పాస్ వర్డ్ అడిగి అందులో కొంత మొత్తం ఉన్నట్లు గుర్తించాడు. అనంతరం శ్రీలలిత మెడలోని బంగారు గొలుసు, చెవి దుద్దులు, చేతి ఉంగరాలు, సెల్ ఫోన్, పౌచ్ లాక్కున్నాడు. బయట మరో మనిషి ఉన్నాడని చెప్పాడు. తాను వెళ్లిన పది నిమిషాలకు బయటకు రావాలని అప్పటి వరకు ఏటీఎంలో కూర్చోమని బెదిరించి దర్జగా వెళ్లిపోయాడు.


బాధితురాలు శ్రీలలిత

 

కొద్ది సేపటికి మైత్రివనం చౌరస్తాలో ఉన్న పోలీసు పెట్రోలింగ్ వాహనం వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సీపీటీవీ ఫుటేజ్‌ విజువల్స్‌  యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి. నగరంలో భద్రత కరువైందని ముఖ్యంగా ఏటీఎం సెంటర్ల వద్ద సెక్యూరిటీ లోపించందని అందుకు తాజాగా జరిగిన సంఘన ఉదాహారణ అని ఇప్పటికైనా సెక్యూరిటీ విషయంలో బ్యాంకులు చొరవ చూపాలని స్థానికులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: