ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు బ్రిడ్జి పై నుంచి నదిలో పడింది. అదృష్ట వశాత్తు  గోదావరి నదిలో నీరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు మృతి చెందిన వారు ఇద్దరూ మహిళలే, మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు  అందులో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉంది. భద్రాలచం డిపోకు చెందిన ఆర్టీసీ రామబాణం బస్సు ఖమ్మం నుంచి భద్రాచలం వస్తుండగా బ్రిడ్జి పైకి వెళుతున్న సమయంలో  ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 


బస్సు బోల్తా పడిన దృశ్యం


ఎదురుగా ఓ వాహనం వస్తుండటంతో బస్సు డ్రైవర్ ఎడమ వైపుకు తిప్పాడని, దీంతో అది అదుపు తప్పిందని, అనంతరం బ్రిడ్జి నుండి పడిపోయిందని చెబుతున్నారు.స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.  ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 44 నుండి 48 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా  డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: