ఆ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన విషయం తెలిసిందే.. అయితే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వారి డిమాండ్లకు తలొగ్గాయి, ఏపీలో 43% ఇవ్వగా తెలంగాణలో 44% వరకు ఫిట్ మెంట్ ఇచ్చారు. అసలే ఆర్టీసీ నష్టాల బాటలో నడుస్తుందని చెప్పే ప్రభుత్వం ఉన్న ఫలంగా ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కురిపించడంతో ప్రజలపై చార్జీల మోత తప్పవని ఆనాడే స్పష్టం చేశారు. ఇప్పుడు అది అమలు జరిగే తీరు కనబడుతుంది. 


తెలంగాణ ఆర్టీసీ


త్వరలో ఆర్టీసీ ఛార్జీలు పెంచుతామని తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 28  నుంచి ఆర్టీసీ రెండుగా విడిపోతున్నాయని మహేందర్రెడ్డి వివరించారు.ఆర్టీసీ విభజన ప్రక్రియ జరుగుతుందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు.   కమిటీ రూపొందించిన విధి విదానాలకు అణుగుణంగా చార్జీలు పెంచనున్నట్లు వెల్లడించారు. రాజధానికి అనుసంధానం చేస్తూ కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: