గత కొంత కాలంగా ఏపీలో రాజధానిపై పెద్ద రగడే సాగుతుంది. ఏపీ రాజధాని కోసం భూ సేకరణ చేయాల్సిందే అంటూ ప్రభుత్వం భూ సేకరణ కోసం మే 14న జీవో నెంబర్ 166ను ఏపి ప్రభుత్వం తీసుకొచ్చిని విషయం తెలిసిందే. అయితే రాజధాని భూ సేకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపి రాజధాని భూసేకరణకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది, రెండు వారాలపాటు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. జూన్ మొదటి వారానికి విచారణ వాయిదా వేసింది.


హై కోర్ట్ ఆఫ్ ఆంధ్ర్రప్రదేశ్


ఆంధ్రప్రదేశ్ అభివృద్ది జరగాలంటే రాజదాని అవసరం అని ప్రస్తుత రాజధాని కేవలం పది సంవత్సరాల వరకు ఉంటుందని అదీ ఉమ్మడి రాజధానిగా మాత్రమే ప్రస్తుతం హైదరాబాద్ ఉందని ప్రభుత్వం భావిస్తుంది.  భూ సేకరణ తప్పని సరి అని పంటలు పండే భూములను మినహాయిస్తామని కోర్టులో ప్రభుత్వం తెలిపింది. దీనికి కౌంటర్ గా రెండు వారాలపాటు స్టే ఇస్తే మీకు నష్టమేంటని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ స్టేతో ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. ఎందుకంటే మే 31న ప్రభుత్వం భూసేకరణ చేయాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రైతుల నుంచి విమర్శలు రావడం, కాంగ్రెస్ పార్టీ , వైఎస్సార్ పార్టీ రైతులకు మద్దుతు తెలపడం ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టినట్లు అనిపిస్తుంది.


ఆంధ్రప్రదేశ్ మ్యాప్

high court stay on andhra pradesh capital land acquisition

ఇది ఇలా ఉండగా, ఏపి రాజధాని కమిటీతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. రాజధానితో ముడిపడి వున్న భూ సేకరణ, ఇతరత్రా అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఎంపి గల్లా జయదేవ్ సహా ఇతర కమిటీ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: