నిరు పేద‌ల ఇళ్ల కోసం అవ‌స‌ర‌మైతే ఓయూ, అగ్రికల్చర్‌, ఓపెన్‌ వర్సిటీల్లో స్ధ‌లం తీసుకునైనా ఇళ్లు కట్టిస్తాం. 2 యూనివర్సిటీల్లోనూ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా సీయం కేసీఆర్ సికింద్రాబాద్‌లోని పర్యటించినప్పుడు ప్ర‌జ‌ల‌కిచ్చిన వాగ్దానాలు. ఓయూ యూనివర్సిటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఓపెన్‌ యూనివర్సిటీల్లో కావాల్సినంత స్థలం ఉందని తెలిపారు. ఇప్పుడు ఆ ప్ర‌క‌ట‌న వివాధ‌స్ప‌ద‌మైంది. యూనివ‌ర్శిటీ విద్యార్దులు తీవ్ర అభ్యంతరాన్ని తెలిపారు.యూనివ‌ర్శ‌టీ జోలికి వ‌స్తే ఉరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు విద్యార్ధ‌లు ఆర్ట్స్ కాలేజ్ వ‌ద్ద కేసీఆర్ దిష్టి బొమ్మ‌ను ద‌గ్దం చేశారు. యూనివ‌ర్శ‌టీ భుముల్లో పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టిస్తామ‌న్న మాట‌ల‌ను వెనక్కి తీసుకోవాల‌ని వారు ఆందోళ‌న‌కు దిగారు.  

యూనివర్సిటీ మొత్తం భూమి లో సగానికి సగం మాయమైంది


ఓయూ ఎంత భూమితో మొదలైంది, ఇప్పుడు ఎంత మిగిలిందో తెలుసుకోవ‌ల్సిన అవ‌స‌రం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీని నాటి నిజాం ప్రభువు దీర్ఘకాల ప్రయోజనాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించారు. దానికోసం 2,800 ఎకరాలు కేటాయించారు. కాలం గడుస్తున్న కొద్దీ యూనివర్సిటీ భూములపై అందరికన్ను పడింది. అందినకాడికి అందరూ ఆక్రమించుకున్నారు. ఇటు డీడీ కాలనీ మొదలు తార్నాకలోని ఆరాధనా సినిమా థియేటర్,రామంతాపూర్ రోడ్డులోని దూరదర్శన్ స్టూడియో, దాని చుట్టుపక్క ల నిర్మాణాల దాకా అన్నీ యూనివర్సిటీ భూముల్లో నే నిర్మితమయ్యాయి. యూనివర్సిటీ మొత్తం భూమి లో సగానికి సగం మాయమైంది. అదిప్పుడు 1,470 ఎకరాలకు కుచించుకుపోయింది. ఉన్న భూమిని అయినా విద్యార్థిలోకం విద్యావసరాలకు, ఆధునిక పద్ధతుల్లో వినియోగించుకుంటున్నామా? అంటే లేదనే చెప్పాలి. అందుబాటులో ఉన్న భూమిలో పదిహేను, ఇరవై శాతం కూడా ఉపయోగంలో లేదు.


యూనివర్సిటీ ప్రారంభంలో 2,350 ఎకరాల్లో


ఉస్మానియానే కాదు, హైదరాబాద్ పరసరాల్లో నిర్మితమైన అన్ని యూనివర్సిటీల్లోను ఇదే తంతు. రాజేంద్రనగర్‌లో 600 ఎకరాల్లో విస్తరించి ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ భూములు కూడా అన్యాక్రాంతమయ్యాయి. కిస్మత్‌పురా, బుద్వేల్, ప్రేమావతిపేట ప్రాంతంలో 30 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ప్లై ఓవర్లతో వంద ఎకరాల దాకా తరిగిపోయింది. ఈ ప్లై ఓవర్ల పొడవునా జోరుగా ఆక్రమణలు సాగుతున్నాయి. తెలంగాణ విద్యావసరాలకు అనుగుణంగా నిర్మితమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభంలో 2,350 ఎకరాల్లో ఉండేది.ఆ తర్వాత గత పాలకులంతా ఇందులోని భూములనే పలు జాతీయ సంస్థలకు ఉదారంగా అప్పగించారు. 


భూములే ధారాదత్తం చేశారు.

Image result for ou university

ఇక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎనిమల్ బయో టెక్నాలజీకి వంద ఎకరాలు, నాలెడ్జ్ అండ్ ఇన్నోవేటివ్ సెంటర్‌కు 200ఎకరాలు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌కు పది ఎకరాలు ఇలా చెప్పుకుంటూపోతే.. ఏ జాతీయ సంస్థకైనా హెచ్‌సీయూ(హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ) భూములే ధారాదత్తం చేశారు. చివరికి బస్‌డిపోకు వంద ఎకరాలు కట్టబెట్టారు. ఇక కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. వెయ్యి ఎకరాల విస్తీర్ణంతో ఉన్న కేయూ భూముల్లోనే సీఆర్‌పీఎఫ్ క్యాంపుకు, పోలీస్‌స్టేషన్లకు ఎకరాల కొద్దీ భూమిని అప్పజెప్పారు. 



పేదలకు ఇళ్లు కట్టిస్తామని అంటే


ఇప్పుడు కేయూలో మిగిలింది 650 ఎకరాలు మాత్రమే. అయితే వర్సిటీ భూముల ఆక్రమణల గురించి ఎన్నడూ మాట్లాడని వారు ఇప్పుడు ఓయూ భూముల గురించి మాట్లాడుతున్నారు.యూనివర్సిటీకి కూత వేటు దూరంలో నగరం నడిబొడ్డున కడు దయనీయ పరిస్థితుల్లో నివసిస్తున్న పేదలకు ఇళ్లు కట్టిస్తామని అంటే అదో పెద్ద దుర్వినియోగంగా కనిపించడమే విడ్డూరం. అది కూడా యూనివర్సిటీ కాంపౌండ్ వాల్‌కు బయట ఉన్న యూనివర్సిటీ భూముల్లోనే పేదల ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం చెబుతున్నా కొందరు కావాలని నానా యాగి చేస్తున్నారని. విద్యార్థుల్లో, ప్రజల్లో లేని పోని అపోహలు సృష్టిస్తున్నారని అదికార టీఆర్ఎస్ వాద‌న‌.


మరింత సమాచారం తెలుసుకోండి: