అధికారపక్షంలో ఉన్నవారితో పోలిస్తే ప్రతిపక్షానికి ఉండే కష్టాలు ఎక్కువే. అధికార పక్షం వారు ఏదో రకంగా రోజూవార్తల్లోనే ఉంటారు. కానీ ప్రతిపక్షనేతలు ఏదో ఒక కార్యక్రమం చేపట్టకపోతే మీడియా ఫోకస్ ఉండదు. అందుకే ప్రతిపక్షనేత జగన్ నిరంతరం ఏదో ఒక కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ విడిపోయి ఏడాది కావస్తోంది. చంద్రబాబు పాలనకూ ఏడాది పూర్తవుతోంది.

జగన్ దీక్షపై టీడీపీ మండిపాటు..


ఈ ఏడాది పాలన విజయాలను ప్రభుత్వం ఘనంగా చెప్పుకోవాలని భావిస్తుంటే.. వైఫల్యాలను ఎండగట్టాలని ప్రతిపక్షం భావిస్తోంది. అందుకే మంగళగిరిలో వచ్చేనెల 3,4 తేదీల్లో ప్రభుత్వ వైఫల్యాలపై జగన్.. సమరదీక్ష పేరుతో.. నిరాహారదీక్ష చేపట్టబోతున్నారు. ఎన్నికలకు ముందు వందల సంఖ్యలో హామీలిచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు కనీసం పది కూడా అమలు చేయలేదన్నది ప్రధాన ఆరోపణ.

సమర దీక్ష కాదు.. అసుర దీక్ష..


ఐతే.. జగన్ దీక్షపై టీడీపీ కూడా జోరుగానే విమర్సలు గుప్పిస్తోంది. ఇక జగన్ అంటే విరుచుకుపడే వారిలో ముందు వరుసలో ఉండే మంత్రి రావెల కిషోర్ బాబు మరోసారి తన మాటలకు పదును పెట్టారు. విమర్శల ప్రాస కోసం కాస్త సినీ పరిజ్ఞానం కూడా ఉపయోగించారు. జగన్ చేస్తున్నది సమర దీక్ష కాదు.. అసుర దీక్ష అంటూ తాజాగా వస్తున్న నారా రోహిత్ అసుర సినిమా టైటిల్ వాడేశారు. అధికారం కోసమే జగన్ అర్రులు చాస్తున్నాడని రావెల మండిపడ్డారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: