ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చైనా యాత్ర పర్యటన ఫలాలు ఒక్కొక్కటిగా అందివస్తున్నాయి. నాలుగైదు రోజులపాటు విసుగూ, విరామం లేకుండా చైనా పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు జరిపిన సంప్రదింపులు ఇప్పుడు పెట్టుబడుల రూపంలోకి మారే అవకాశం కనిపిస్తోంది. చైనా దేశంలోని చెంగ్డు నగర ప్రతినిధులు ఏపీలో పెట్టుబడుల అవకాశాలు పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చారు. 

ఏపీపై చైనా కన్ను.. 


హైదరాబాద్ కు వచ్చిన చెంగ్డు ప్రతినిధుల బృందం చంద్రబాబును కలసి పెట్టుబడి మార్గాలపై చర్చించింది. రెండు రాష్ట్రాల మధ్య ప్రధానంగా సాఫ్ట్ వేర్ రంగం, పర్యాటక రంగాల్లో వ్యాపారాలకు అవకాశాలున్నాయని వారు ఒక అంచనాకు వచ్చారు. రెండు పక్షాలు కలసి ముందుకు సాగాలని నిర్ణయించారు. 

చెంగ్డు టు అమరావతి


ఏపీలో కొత్త రాజధాని నిర్మిస్తున్నందువల్ల.. అక్కడ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి సూచించారు. మౌలిక సదుపాయాలు, నౌకానిర్మాణం, తయారీ రంగం, ఆహారశుద్ధి రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని వారికి వివరించారు. ఇప్పుడు వచ్చింది కేవలం ఒక నగరానికి చెందిన వ్యాపారవేత్తల బృందం మాత్రమే. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలుంటాయని ఏపీ భావిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: