మా భాష, మా యాస అంటూ మొదలైన తెలంగాణ ఉద్యమం.. అనేక కొత్త పుంతలు తొక్కింది. తొలుత వెనుకబాటు వాదం బలంగా వినిపించినా.. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత ఆ వాదన బలం తగ్గింది. ఆ తర్వాత మా సంస్కృతి, ఆత్మాభిమానం, స్వయంపాలన అంటూ కొత్త నినాదాలు వినిపించాయి. కథ అనేక మలుపులు తిరిగి చివరకు రాష్ట్రం సాధించారు. 

ఏపీకి క్యూ కడుతున్న తెలంగాణ ఉద్యోగులు.. 


ఐతే.. ఎలాగూ రాష్ట్రం వచ్చేసింది కదా అని ఆత్మాభిమానం, స్వాభిమానం అంశాలను తెలంగాణ ఉద్యోగులు పక్కకుపెట్టేశారని ఆంధ్రా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే.. రాష్ట్రవిభజనలో భాగంగా.. ఉద్యోగులను ఆప్షన్ అడిగినప్పుడు.. కొందరు తెలంగాణ ఉద్యోగులు కూడా ఏపీ కావాలని ఆప్షన్ పెడుతున్నట్టు వారు అనుమానిస్తున్నారు. అందుకు కారణం ఏపీలో పదవీవిరమణ వయస్సు తెలంగాణ కంటే ఎక్కువ ఉండటమే. 

ఇప్పుడు ఆత్మాభిమానం లేదా..?


ఈ విషయంపై ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు..  ఏపీ సీఎం చంద్రబాబును కలిసి.. ఇలాంటి వారిని కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. విడిపోతే ఉద్యోగాలన్నీ తమకే వస్తాయని ప్రచారం చేసిన తెలంగాణ ఉద్యోగులు..ఇప్పుడు ఆంధ్రాకు ఎందుకు ఆప్షన్ పెడుతున్నారని అశోక్ బాబు మండిపడుతున్నారు. మరో రెండేళ్ల ఉద్యోగం కోసం పాకులాడుతున్న తెలంగాణ ఉద్యోగుల స్వాభిమానం ఎక్కడకుపోయిందని నిలదీస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: