అవును ప్రొఫెసర్ కోదండ రామ్ కి కోపం వచ్చింది..? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్షిశలు కష్టబడి, తన ఉద్యోగాన్ని సైతం పక్కకు పెట్టి ఉద్యమం కొసం ముందడు వేసిన మహా నాయకుడు. అన్ని రాజకీయ పార్టీలను, అన్ని సంఘాలను కలుపుకొని తెలంగాణ సాధనే పరమ అవధిగా పోరాడిన వ్యక్తి కోదండ రామ్. తెలంగాణ జేఏ సి చైర్మెన్ కొనసాగుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఎలాంటి పదవులు ఆశించని వక్యి అలాంటి కోదండరాం కు కోపం వచ్చింది.


ఉద్యమ బాటలో కోదండరామ్

అదీ ప్రభుత్వంపై కాదు, తెలుగు ఇండస్ట్రీ మీద అవును తెలుగు సినిమా నాలుగైదు కుటుంబాల చేతిలోనే ఉందని ,అలాగే థియేటర్లు కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నాయని ఇప్పుడు పరిస్థితి కి స్వస్తి చెప్పాలని అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసి విన్నవించారు కోదండరాం.

ఫిల్మ్ ఇండస్ట్రీ వారితో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్


ఆ మధ్య తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణలో చిత్రపరిశ్రమకు పెద్ద పీట వేస్తామని చెప్పుకొచ్చారు. మరి చిన్న చిన్న నిర్మాతలు ఇప్పుడిప్పుడు సినిమా అవకాశాలు వస్తున్న వారు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద వారి వ్యవహారంతో వేగ లేక పోతున్నారని కోదండరామ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, ఇది అరికట్టి తారాలని ఆయన అంటున్నారు.తెలంగాణ ఫిలిం చాంబర్ కు అధికారికంగా గుర్తింపు ఇవ్వాలని అలాగే సబ్సిడీ కూడా ఇవ్వాలని కోరారు కోదండరాం 


మరింత సమాచారం తెలుసుకోండి: