ఢిల్లీ పీఠం ఏ ముహూర్తంలో ఎక్కాడో కానీ కేజ్రీవాల్ కి మనశ్శాంతి లేకుండా పోయింది. సొంత పొర్టీలో తలెత్తే వివాదాలతో సతమతం అవుతుంటే మరో పక్క  లెప్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య తలెత్తిన వివాదం రోజురోజుకీ కొత్త మలుపు తిరుగుతుంది. లెప్టెనెంట్ గవర్నర్‌గా నజీబ్ జంగ్‌కున్న విశిష్ట అధికారాలను కేంద్రం ప్రకటించింది. అధికారులను పోస్టింగ్ చేయడం, బదిలీలు, తొలగింపు వంటి అధికారాలు గవర్నర్‌కు ఉన్నాయని, ఈ విషయంలో మందస్తు సమాచారాన్ని ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.


లెప్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్

Centre draws the line for Arvind Kejriwal, supports Najeeb Jung

 ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలపై కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంపై కేజ్రీవాల్ శుక్రవారం స్పందించారు. అది వారి అభద్రతా భావానికి నిదర్శనమని, తనను చూసి కేంద్రం భయపడుతోందని వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం చేపట్టిన అవినీతి వ్యతిరేక పాలనపై భయం పట్టుకుందని అన్నారు. 'తొలుత ఢిల్లీ ఎన్నికల్లో ఓడిన బీజేపీ, ఇప్పుడు మా ప్రభుత్వానికి నోటీసులిచ్చి మరోసారి ఓడిపోయింది' అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.


బిజేపీ, ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)


ఈ నోటిఫికేషన్‌పై కేజ్రీవాల్ మరికాసేపట్లో ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. తర్వాత ఆయన స్పందన ఎలా ఉంటుందో.. తర్వాత కేజ్రీవాల్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాడో వేచి చూడాల్సిందే..తాజా పరిణామాల నేపథ్యంలో, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరు నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మధ్య అంతరం మరింతగా పెరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: