ఒకప్పుడు తెలుగు సినిమాలో తన అందాలతో మైమరపించి అగ్రహీరోల సరసన నటించి మెప్పించి తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి  అక్కడ కూడా అద్భుత నటన ప్రదర్శించి తన హాట్ లుకింగ్ బాలీవుడ్ షేక్ చేసిన అందాల నటి జయప్రద. సినిమాలో అడపా దడపా నటిస్తూనే రాజకీయ రంగం ప్రవేశించింది. తనకు రాజకీయ జన్మనిచ్చిన సమాజ్ వాదీ పార్టీలో చేరేందుకు జయప్రద సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో ఆమెను పార్టీలో చేర్చుకుని తిరిగి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు అధినేత ములాయం సింగ్ యాదవ్, సీఎం అఖిలేశ్ యాదవ్ సుముఖంగా ఉన్నారు. గవర్నర్ కోటా కింద విధాన్ పరిషత్‌కు 9 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఖరారు చేశారు.


సమాజ్ వాది పార్టీ విజయోత్సాహంలో జయప్రద

సినీనటి జయప్రదకు అదృష్టం కలిసిరాలేదు. ఎమ్మెల్సీ కోటా కింద సీట్ ఇవ్వడం జయప్రద అంటే గిట్టని అజాంఖాన్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో మాజీ ఎంపి జయప్రదకు పెద్ద షాక్‌ తగిలింది. చేతివరకు వచ్చిన ఎమ్మెల్సీ అవకాశం చివరి నిముషంలో జారిపోయింది. సమాజ్‌వాద్‌ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా జయప్రద పేరును ఖరారు అయినా చివరి నిముషంలో యుపి మంత్రి అజాంఖాన్‌ అడ్డుపడ్డాడు. ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటానికి వీల్లేదంటూ పట్టుబట్టాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: