ప్రభుత్వాలకు సొమ్ము అవసరమైనప్పుడు నిధులు సేకరించేందుకు కొన్ని సులభమైన మార్గాలుంటాయి. వాటిలో అక్రమ కట్టడాల క్రమబద్దీకరణ ఒకటి. అక్రమంగా కట్టడాలు నిర్మించినవారు.. నిబంధనలు పాటించినవారు.. కొంత రుసుము చెల్లించి.. వాటిని క్రమబద్దీకరించుకోవచ్చు.

నిధుల కోసం కొత్త ఆయుధం..


తెలంగాణలో ఇప్పటికే కేసీఆర్ ఈ అస్త్రం ప్రయోగించారు. ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు ఈ పని ప్రారంభించబోతున్నారు. అయితే డబ్బు ఇస్తున్నారు కదా అని అన్ని రకాల అక్రమాలు సక్రమాలుగా మారిపోవు.  చెరువులు, శిఖం వంటి కొన్ని రకాల భూముల్లో నిర్మించిన భవనాలను క్రమబద్దం చేయరు. 

కాసుల వర్షం కురిపించేనా..?


అంతేకాదు.. 1985 నుంచి 2014 డిసెంబర్ లోపు నిర్మించిన భవనాలకే ఈ క్రమబద్దీకరణ వర్తిస్తుంది. ఈ రెగ్యులరైజేషన్ బాగానే కాసుల వర్షం కురిపిస్తుందని చంద్రబాబు సర్కారు ఆశలు పెట్టుకుంది. దీనికితోడు.. నిధుల సమీకరణ కోసం మరోసారి బాండ్లను విక్రయించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ స్టాక్స్‌ ను  విక్రయించడం ద్వారా రూ.1,200 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: