అప్పుడప్పుడు మీడియా ముందుకు రావడం.. ఆ తర్వాత చాలారోజులపాటు మళ్లీ మౌనంగా ఉండటం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఓ అలవాటుగా మారిపోయింది. పార్టీపెట్టినా ఇంకా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాకుండా.. అడపాదడపా పర్యటనలు, స్టేట్ మెంట్లతోనే కాలం వెల్లబుచ్చుతున్నాడీ పవర్ స్టార్. రాజధాని భూముల సేకరణపై కొన్నిరోజుల క్రితం ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు పవన్. 

పవన్ సన్నిహితుడికి ఎమ్మెల్సీ.. 


భూములు లాక్కుంటే పోరాటం తప్పదని పాత మాటే చెప్పినా.. అంతా అలర్టయ్యారు. ప్రభుత్వం భూసేకరణకు దిగుతుందని అంతా భావిస్తున్న సమయంలో పవన్ స్టేట్ మెంట్ కు ప్రాధాన్యం వచ్చింది. ఐతే.. ఆ తర్వాత మళ్లీ యథావిధిగానే పవన్ సైలంటైపోయారు. ఐతే.. ఈ సైలెన్స్ కు కారణం.. సైలెన్సు కు కారణం.. ఆయన సన్నిహితుడుగా పేరున్న సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమేనని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

పవన్.. ఇప్పుడు హ్యాపీయేనా..

 
బీజేపీకి పవన్ కళ్యాణ్ ను దగ్గర చేయడంలో ఈ సోము వీర్రాజు కీ రోల్ పోషించారు. మోడీ వద్దకు పవన్ కళ్యాణ్ ను తీసుకు వెళ్లింది కూడా ఈయనే అంటారు. అందుకే ఇప్పుడు పవన్ పట్టుబట్టి సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇప్పించుకున్నాడని అంటున్నారు. అనుకున్నట్టే ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి పవన్.. కొన్నాళ్లవరకూ ప్రశ్నించరన్న కామెంట్లు జోరందుకున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: