ఏపీ సర్కారు తొలి ఏడాది పాలన ఈనెల 8తో పూర్తవుతోంది. ఏడాది ఎక్కువ సమయం కాకపోయినా.. ఈ కొద్ది సమయంలోనే చెప్పుకోదగిన ప్రగతి కనబరిచామని చంద్రబాబు టీమ్ క్లెయిమ్ చేసుకుంటోంది. ప్రత్యేకించి రాజధాని విషయంలో తాము గ్రాండ్ సక్సస్ అయ్యామని చెప్పుకుంటోంది. 

ఏపీ కేపిటల్..ఫారిన్ రియల్ ఎస్టేట్.. 


రాజధాని విషయంలో చంద్రబాబు చొరవను మెచ్చుకోవాల్సిందే. రెండు ప్రాంతాల వారినీ రాజధాని స్థలం విషయంలో ఒప్పించడం.. ఎక్కడా అసంతృప్తిరాకుండా చూసుకోవడంలో ఆయన తన చాణక్య నీతి ప్రదర్శించారు. అంతేకాదు.. చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితుల్లో పైసా ఖర్చు చేయకుండా 30 వేల ఎకరాలు సేకరించడంలో సక్సస్ అయ్యారు. 

ఎండగట్టేందుకే సమర దీక్ష.. 


అంతవరకూ బాగానే ఉంది. ఐతే.. సేకరించిన భూమిని విదేశీ సంస్థల చేతుల్లో పెడుతున్నారని ప్రతిపక్షం గోల చేస్తోంది. 99 ఏళ్లపాటు విదేశీ కంపెనీలకు రాజధాని భూములను అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని.. ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. ఆరోపించారు. ఏడాది పాలనలో ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఉమ్మారెడ్డి ఆరోపించారు. బాబు వైఫల్యాలను ఎండగట్టేందుకే.. జగన్‌ జూన్ 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు సమర దీక్ష చేస్తున్నారని వెల్లడించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: