ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నికల్లో గెలుపు అందరికీ సాధ్యం కాదు. అందుకే అలాంటి వారి కోసం ఎమ్మెల్సీ వంటి అవకాశాలు ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. ఇవి అచ్చంగా పార్టీ అధినేతల ఇష్టాఇష్టాలపై కట్టబెట్టే పదవులే. అందుకే వీటిపై పార్టీ నేతలు ఆశలు పెట్టుకుంటారు. 

లక్ష్మీపార్వతికి కష్టకాలం.. 


ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి కూడా అలా.. ఓ ఎమ్మెల్సీ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. పూలమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సి వచ్చినట్టు.. ఒకప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు తాను ఎవరికి చెబితే వారికే దక్కేలా చేసిన లక్ష్మీ పార్వతి ఇప్పుడు ఓ ఎమ్మెల్సీ స్థానం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఐతే.. ఉన్న ఒక్క ఎమ్మెల్సీ సీటు పాపం జగన్ మాత్రం ఎంతమందికి ఇవ్వగలరు. 

జగన్.. పట్టించుకోవడం లేదా..?


అందుకే సొంత జిల్లాకే చెందిన ఓ నమ్మకమైన నాయకుడికి ఆ ఎమ్మెల్సీ సీటు కట్టబెట్టేశారు. దీంతో ఆ సీటుపై ఎప్పటి నుంచో కన్నేసిన లక్ష్మీపార్వతి తీవ్రంగా డిజప్పాయింట్ అయ్యారట. ఒకప్పుడు ఓ పార్టీకి అధ్యక్షురాలైన తనకు కనీసం ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం అవమానించడమే అని ఆమె సన్నిహితుల వద్ద వాపోతున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: