ప్రత్యేక హోదాపై ఆంధ్రాజనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన తమకు ప్రత్యేక హోదా ఒక్కటే ఆ నష్టాన్ని పూడ్చగలదని నమ్మారు. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా హామీని బాగా వాడుకున్నాయి. 

హోదా ఇవ్వలేమంటూ జైట్లీ సంకేతాలు..


తీరా.. విభజన పూర్తయ్యాక ప్రత్యేక హోదా హామీ అమలుపై మాత్రం మీనమేషాలు లెక్కపెడుతున్నాయి. నిబంధనలు ఒప్పుకోవడం లేదని తప్పించుకుంటోంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయం టీడీపీ, బీజేపీ మైత్రిపై కూడా ప్రభావం చూపుతోంది. 

ఆంధ్రాకు ఎలాంటి లోటూ రానీయరట..



అలాంటి సున్నితమైన సమస్యపై లేటెస్టుగా అరుణ్ జైట్లీ స్పందించారు. ఆంధ్రాకు ప్రత్యేక నిధులు ఇస్తున్నందువల్ల.. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని ఆయన తేల్చి చెప్పేశారు. కాకపోతే.. విభజన వల్ల కలిగిన నష్టం ప్రతి రూపాయినీ ఏపీకి పూడుస్తామని భరోసా ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: