రంగారెడ్డి జిల్లాలో ఓ కన్నతండ్రి కన్న కూతురిపై అత్యాచారం చేసి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. ఆ ఘటన జరిగిన తీరును తెలంగాణ పోలీసులు కళ్లకు కట్టినట్టు వివరించారు. సొంత కూతురుని బంధువుల ఇంటి నుంచి తీసుకువస్తున్న ఓ తండ్రి దారిలో మద్యం సేవించడమే ఈ ఘటనలో కీలక మలుపు అని అర్థం అవుతోంది. 

బైకుపై వెళ్తున్న తండ్రి.. అతన్ని వెనుక నుంచి గట్టిగా పట్టుకున్న 15 ఏళ్ల కూతురు.. తండ్రిపై ప్రేమతో.. రక్షణ కోసం అతన్ని వెనుకనుంచి గట్టిగాపట్టుకోవడం సాధారణమే. కానీ ఇక్కడ మద్యం మత్తు ఆ తండ్రిలోని కన్న ప్రేమకు బదులు.. కామవాంఛను ప్రేరేపించింది. 

ఈ హత్యాచార పాపంలో పాలకులకు భాగం లేదా..?


మద్యం మత్తులోనే.. అతడు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.. విషయం తెలిస్తే పరువు పోతుందని గొంతుపిసికి చంపేశాడు. ఈ ఘోరానికి మద్యం మత్తే పూర్తిగా కారణమా.. తాగితే మాత్రం కన్నకూతుర్ని చెరిచే విషయం కూడా తెలియదా.. అన్న అనుమానాలు రావచ్చు. కానీ తండ్రి దుర్మార్గుడే అయినా.. అతను తాగకపోయి ఉంటే.. ఈ దుర్మార్గం జరిగేది కాదన్నది వాస్తవం. 

తెలుగు రాష్ట్రంల్లో జరిగే నేరాలు, ఘోరాలకు మద్యం పరోక్ష కారణమన్న సంగతి తెలిసిందే. మరి ఇన్ని అనర్థాలకు కారణమైన మద్యాన్ని ఎందుకు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఆదాయం కోసం ఇబ్బడి ముబ్బడిగా షాపులకు ఎందుకు లైసెన్సులు ఇస్తున్నాయి. పాలనకు అవసరమైన ఆదాయం మద్యంతో తప్ప ఇంకో మార్గంలో రాదా.. ఇలా మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంతో తప్ప పాలన సాగించలేని అనాగరిక ప్రపంచంలో ఉన్నామా.. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘోర పాపంలో పాలకులకు భాగం లేదా.. ఈ ప్రశ్నలకు బదులు చెప్పేదెవరు..?



మరింత సమాచారం తెలుసుకోండి: