ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ నేతల పేర్లు ప్రభుత్వ పథకాలకు, ఊర్లకు, ప్రాజెక్టులకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పార్టీలు అధికారం మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చే అంశాలు వివాదాస్పదం అవుతూనే ఉంటాయి. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం పాత పేర్లు తీసేసి.. అనేక పథకాలకు ఎన్టీఆర్ పేరు పెట్టేసింది. 

కడప నుంచి వై.ఎస్. పేరు తీసేస్తారా..?


మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. వైఎస్సార్ కడప జిల్లాలోని వైఎస్సార్ పేరును తీసేసే ప్రతిపాదన వివాదాస్పదం అయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వైఎస్. రాజశేఖర్ రెడ్డి విమానప్రమాదంలో చనిపోయిన కొన్ని నెలలకే.. కడప జిల్లాకు వైఎస్సార్ పేరు పెట్టేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. వైఎస్సార్ పేరు పెట్టినా జనం కడపగానే పిలుచుకుంటున్నారనుకోండి.. కానీ అధికారికంగా అది వైఎస్సార్ కడప జిల్లాయే కదా..

కానీ ఇప్పుడు కడప జిల్లా పేరులోని వైఎస్సార్ తీసేయాలని ఆ జిల్లా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మినీ మహానాడులో ఓ తీర్మానం కూడా చేశారు. వెంకటేశ్వరుని గడపగా ప్రసిద్ధి చెందిన కడపకు అనవసరంగా వైఎస్సార్ పేరు పెట్టారని.. దాన్ని తొలగించాలని వారు చెబుతున్నారు. మరి వీరి కోరికను చంద్రబాబు తీరుస్తారా..?


మరింత సమాచారం తెలుసుకోండి: