కేసీఆర్ కు దైవ భక్తి ఎక్కువే. ఏ పని మొదలుపెట్టినా.. ముహూర్తాలు, పంతుళ్ల హంగామా ఉంటుంది. కాస్త కూస్తో ఖాళీ దొరికితే యజ్ఞాలు, యాగాలు కూడా చేసేస్తుంటారు. అధికారంలోకి వచ్చాక యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

కేసీఆర్ భక్తా.. హారతిపై పన్నా.. అదేలనయ్యా..?


మరి ఇంత చేస్తున్న కేసీఆర్ అంటే హిందూదేవుళ్లకు ఎందుకు కోపం వస్తుంది.. ఆయన చేసిన నేరమేంటి.. ఉంది.. హిందూ దేవాలయాల్లో హారతి ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. హారతి ఇవ్వందే పూజ పూర్తయినట్టు కాదు.. దర్శనం కోసం వెళ్లిన వారు హారతి కళ్లకు అద్దుకోందే.. సంతృప్తి చెందరు. 

మరి అలాంటి కర్పూరంపై కేసీఆర్ ప్రభుత్వం పన్ను వేస్తోంది. సాధారణంగా పూజా ద్రవ్యాలపై పన్ను ఉండదు. కానీ.. కర్పూరం ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి.. దాన్ని ఔషధాలకోటాలే వేసేశారు. అందుకే 5 శాతం వ్యాట్ వేస్తున్నారు. దీనిపై గతంలోనే వివాదాలు వచ్చినా.. పలు కోర్టు తీర్పులను అధ్యయనం చేసిన తెలంగాణ ప్రభుత్వం చివరకు పన్ను వేయాలనే డిసైడ్ చేసింది.   



మరింత సమాచారం తెలుసుకోండి: