అక్కడో గ్లాసుంది.. దాంట్లో సగం నీరుంది. సగం గ్లాసు ఖాళీగా ఉందనేవాడు ప్రతిపక్షనేత.. సగం గ్లాసు నిండుగా ఉందనేవాడు అధికారపక్షం. చంద్రబాబు ఏడాది పాలన సందర్భంగా కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య ఇలాంటి వాదనలు వినిపిస్తున్నాయి. 

జగన్.. దమ్ముంటే చర్చకు రా..?


చంద్రబాబు ఎన్నికలకు ముందు వందల కొద్దీ హామీలిచ్చాడని.. కనీసం పదుల సంఖ్యలో కూడా అమలు చేయలేదని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అంటున్నారు. అందుకే బాబు ఏడాది పాలన సందర్భంగా సమరదీక్ష కూడా ఏర్పాటు చేస్తున్నారు. పాలక పక్షం అసమర్థతను ఎండగడతామంటున్నారు. 

జగన్ వాదనపై అచ్చెన్నాయుడు, రావెల కిషోర్ బాబు వంటి నాయకులు మండిపడుతున్నారు. జగన్ సమరదీక్షను ఎద్దేవా చేస్తున్నారు. దమ్ముంటే.. ఏడాది పాలనపై చర్చకు రావాలని సవాల్ విసురుతున్నారు. ప్లేసు నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. అంటూ తమ నాయకుడు బాలయ్య తరహాలో సవాళ్లు విసురుతున్నారు. టీడీపీ మినీమహానాడుల్లో ఇప్పుడు ప్రతినేతగా జగన్ నే టార్గెట్ చేసుకుంటున్నారు. మరి జగన్ స్పందిస్తారా.. చర్చకు సై అంటారా..? 


మరింత సమాచారం తెలుసుకోండి: