స్వచ్ఛ భారత్ సందర్భంగా కేసీఆర్ పేదవారికి ఇండ్లు కట్టి ఇస్తానని మాట ఇచ్చాడు, మరి ఆ ఇళ్ల నిర్మాణం ఎక్కడో కాదు ఉస్మానియా యూనివర్సిటీ లో దాదాపు పదకొండు ఎకరాలు తీసుకొని ఈ కార్యక్రమం చేపతానని పేదవారికి మాట ఇచ్చారు. అప్పటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళన బాట చేపట్టారు, కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం, శవయాత్రలు లాంటి నిరసనలు తెలిపారు. కానీ కేసీఆర్ మాత్రం ఇవేమీ లెక్క చేయకుండా ఇళ్లు కట్టి తీరుతా అని మొండి పట్టు పట్టాడు. దీనిపై విపక్షాలు పెదవి విరిచాయి తెలంగాణ సాధన లో విద్యార్థులది కీలక పాత్ర అని అలాంటి విద్యార్థుల మనోభావాలు దెబ్బతీసి కేసీఆర్ వ్యవహారం మంచిది కాదని హెచ్చరించారు.


విద్యార్థులతో మాట్లాడుతున్న జెఎసి ఛైర్మన్ కోదండరామ్


తాజాగా వీరితో పాటు జెఎసి ఛైర్మన్ కోదండరామ్ కూడా గొంతు కలిపారు. ఆదివారం రాత్రి జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొన్నారు. పేదల ఇళ్ల కోసం వర్సిటీ భూములే తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ‘పేద ప్రజల ఇళ్ల కోసం విశ్వవిద్యాలయాల భూములను స్వాధీనం చేసుకోవడం తప్పు అన్నారు. పేద వారికి ఇళ్లు కట్టించి ఇవ్వడం మంచిదే  కానీ, వర్సిటీ భూములను మాత్రం విద్యా సంబంధ, పరిశోధనలకు మాత్రమే వాడుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: