దేశలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు ఎక్కువై పోతున్నాయి. నిర్లక్ష్యంగా చేసే డ్రైవింగ్ ఎందరి ప్రాణాలు హరించి వేస్తున్నాయో వేరే చెప్పనవసరం లేదు.  ముఖ్యంగా తెల్లవారు జామున నడిపే వాహనాలు డ్రైవర్ల నిద్రమత్తుతో డ్రైవింగ్ చేస్తూ అదుపు  తప్పి వేరే వాహనాలు ఢీకొనడమో లేదా చెట్టుకో, రోడ్ సైడ్ ఉన్న ఇళ్లల్లోకి దూసుకెళ్లడమో లాంటివి జరుగుతున్నాయి.  తాజాగా కర్నూల్ జిల్లా చాగలమర్రి మండలం బోధనం దగ్గర సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కార్పియో వాహనం అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది దీంతో   స్కార్పియో వాహనంలో ఉన్న మహారాష్ట్రలోని పుణె జిల్లా బారామతి తాలూకా వాసులు ఏడుగురు దుర్మరణం పాలయ్యారు .


ప్రమాద స్థలం వద్ద పోలీసుల ఎంక్వేయిరీ


 ఈ ప్రమాదంలో ఇళ్లూ కూడా తీవ్రంగా నష్టపోయింది,  సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటం వల్ల వాహనం అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న సుబ్బారాయుడు అనే వ్యక్తి ఇంట్లోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.


ప్రమాదంలో దెబ్బ తిన్న ఇల్లు


సుబ్బారాయుడు కుటుంబీకులకు స్వల్ప గాయాలు అవడంతో వారిని కూడా ఆస్పత్రికి తరలించారు.   పుణ్యక్షేత్రమైన తిరుపతి దర్శనానికి బయల్దేరుతున్న వీరు మార్గమధ్య లో ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయం.


ప్రమాదంలో మృతి చెందినవారు



మరింత సమాచారం తెలుసుకోండి: