ఉస్మానియా విద్యార్దుల ఆందోళన తీవ్రతరం అయ్యింది. కేసీఆర్ ఈ మద్య పేదవారి ఇండ్ల నిర్మాణానికి  ఉస్మానియా యూనివర్సిటీ లో స్థలాన్ని కేటాయిస్తానని చెప్పడంతో యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన బాట చేపట్టారు. యూనివర్శిటీ భూములలో పదకొండు ఎకరాలు తీసుకుని పేదలకు ఇళ్లు కట్టిస్తానని అన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటనను వీరు వ్యతిరేకిస్తున్నారు.


యూనివర్సిటీ విద్యార్థులు కోపోద్రేక్తులై రాళ్లు విసురుతున్న దృశ్యం (ఫైల్)


 ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్. యాదగిరిరెడ్డికి చెందిన హోటల్ స్వాగత్ గ్రాండ్ పై దాడి చేశారు. దానిపై రాళ్లు విసిరి అద్దాలు పగుల కొట్టారు.ఫర‌్నిచర్ కూడా ద్వంసం చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి విద్యార్దులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వ్యతిరేక ఉద్యమానికి విపక్షాలు కూడా తోడైనాయి. కాగా ఉస్మానియా భూములను ఆక్రమించి హోటల్ నిర్మించారని విద్యార్దులు ఆరోపించారు. ఇప్పటికైనా కేసీఆర్ తన పంథా మార్చుకోవాలని విద్యార్థులు హెచ్చిరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: