ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950, ఏప్రిల్ 20 వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాస సమయంలో రోజూ పొరుగు గ్రామమైన శేషాపురం కు నడుచుకుంటూ వెళ్ళేవాడు. ప్రాథమిక విద్య అనంతరం చంద్రగిరి లోని జిల్లాపరిషత్తు పాఠశాలలో చేరి ఉన్నత విద్యను పూర్తిచేశాడు.  


తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. విద్యాభాసం పూర్తి కాకముందే కాంగ్రెస్ పార్టీ లో చేరి కీలక పాత్ర పోషించాడు,  కాంగ్రెస్ మంత్రివర్గంలో ఉన్నప్పుడే ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరామారావు కుమార్తె అయిన భువనేశ్వరీ దేవిని 1981, సెప్టెంబర్ 10 వ తేదీన వివాహం చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరీ దేవి పెళ్లినాటి అపురూప చిత్రం మీకోసం..

మరింత సమాచారం తెలుసుకోండి: